వర్గల్(గజ్వేల్): ‘జమ్మి’.. పూజనీయ వృక్షం. దసరా పర్వదినంతో పెనవేసుకుపోయిన బంధం. ఈ రోజున జమ్మి వృక్షాన్ని పూజిస్తారు. విజయాలు సిద్ధింపజేయాలని ప్రార్థిస్తారు. జమ్మి ఆకులను(శమీ పత్రాలను) బంగారంగా భావిస్తూ బంధు, మిత్రులకు పంచుతారు. అలాంటి ప్రాధాన్య జమ్మి వృక్షాలు వర్గల్ మండలం తున్కిఖాల్సాలో ఒకే చోట కొలువుదీరాయి. ‘పల్లె ప్రకృతి వనం’లో కేంద్రంగా మారాయి. దసరా వేడుకలను స్వాగతిస్తున్నాయి. గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో ఒకే చోట 5 జమ్మి వృక్షాలు సహజసిద్ధంగా పెరిగాయి. తాతల కాలం నుంచి అక్కడే దసరా రోజు జమ్మి పూజ జరుగుతుంది. ఏడేళ్ల క్రితం సరికొత్త ఆలోచనతో ‘జమ్మి చెట్లు’ మధ్యలో ఉండేలా, చుట్టూరా వృత్తాకార గద్దెను నిర్మించి, రెండెకరాల విస్తీర్ణంలో పల్లెప్రకృతి వనంగా తీర్చిదిద్దారు. ఏళ్ల చరిత్ర చాటే జమ్మి వృక్ష సముదాయంతో రూపుదిద్దుకున్న పల్లెప్రకృతి వనం, సౌకర్యాల సమాహారంగా, ఆధ్యాత్మికత, ఆహ్లాదాల నెలవుగా రూపాంతరం చెందింది. దసరా జమ్మిపూజకు, సంబురాలకు స్వాగతం పలుకుతున్నది.
స్వాగతిస్తున్న ‘పల్లె ప్రకృతి’


