పీఆర్ డీసీ శైలజారెడ్డి గాగిళ్లాపూర్‌లో ఆకస్మిక పర్యటన
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని అన్ని గ్రామాల్లో జలసిరి పనులకు ప్రాధాన్యతనివ్వాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ శైలజారెడ్డి సూచించారు. మండలంలోని గాగిళ్లాపూర్‌లో శనివారం ఆమె ఆకస్మికంగా పర్యటించారు. గ్రామ పంచాయతీలో సమీక్ష నిర్వహించి గ్రామంలో జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో నెలకొంటున్న పరిస్థితులను వివరించారు. వీటి వలన భూగర్భ జలాలు పెరగడంతోపాటు కూలీలకు ఉపాధి లభిస్తుందన్నారు. తీవ్రమైన కరువు పరిస్థితుల వలన వచ్చే ప్రభావాన్ని వివరించారు. వీబీజీ రాంజీలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. పనుల రికార్డులు, కూలీల వివరాలు తెలుసుకున్నారు. పనులలో జాప్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏపీడీ విజిలెన్సు అధికారి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఓ, పీఆర్ ఏఈ తిరుపతిరెడ్డి, సర్పంచ్ ఎర్రల జానకి, ఉపసర్పంచ్ పద్మ, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ వీఏఓలు, సీఏ, పాల్గొన్నారు.


