నంగునూరు(సిద్దిపేట): భర్త మృతి చెంది పుటెట్డు దుఖంలో ఉన్న నిరుపేద కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. సిద్దన్నపేటకు చెందిన కాచగోని రాములు కల్లుగీత కార్మికునిగా పని చేస్తూ ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు జరిపించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన రాములు చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక మూడు రోజుల కిందట మృతి చెందారు. అతని కుటుంబ పరిస్థితి తెలుసుకున్న గ్రామస్తులు చందాలు వేసి చేసి భార్య కళావతికి రూ. 38 వేలు అందజేశారు. కార్యక్రమంలో నారాయణరెడ్డి, తిరుపతి, రాజయ్య, భాస్కర్, మహిపాల్, తిరుపతి ఇర్షాన్ తదితరులు పాల్గొన్నారు.


