జయగౌరీ.. సకల శుభకరి | - | Sakshi
Sakshi News home page

జయగౌరీ.. సకల శుభకరి

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

జయగౌరీ.. సకల శుభకరి

న్యూస్‌రీల్‌

వర్గల్‌(గజ్వేల్‌): విద్యాధరి క్షేత్రంలో దసరా శరన్నవరాత్రోత్సవాలు ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. గురువారం విద్యాసరస్వతి అమ్మవారు సకల శుభకరి గౌరీదేవిగా దివ్యదర్శనమిచ్చారు. ఉదయం ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ బ్రహ్మశ్రీ చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారి మూలవిరాట్‌కు పంచామృతాలతో మహాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు.

లలితా త్రిపుర సుందరి స్వరూపిణిగా..

కొండపాక(గజ్వేల్‌): మర్పడ్గలో గల విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో అమ్మవారు లలితా త్రిపుర సుందరి స్వరూపిణిగా దర్శనమిచ్చారు. హైదరాబాద్‌, గజ్వేల్‌ తదితర పట్టణాలతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి మహిళలు భారీగా తరలిరావడంతో క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

108 కిలోల ఒడిబియ్యం సమర్పణ

చేర్యాల(సిద్దిపేట): పట్టణకేంద్రంలో దేవి స్నేహ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో గురువారం అమ్మవారికి 108 మంది మహిళలు 108 కిలోల ఒడిబియ్యాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.

దాండియా జోష్‌

జోరుగా, హుషారుగా డ్యాన్సులు ● నవరాత్రి వేళ యువత, మహిళల ఉత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement