సిద్దిపేటజోన్: ‘తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ.. అలాంటి బతుకమ్మ వెనుక కూడా సైనన్స్ ఉంది. తంగేడు, గునుగు పువ్వుల వెనుక ఒక సైన్టిఫిక్ రీజన్ ఉంది’ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో పద్మనాయక మండపంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని మార్పులు వచ్చిన బతుకమ్మ మారలేదని, రోజు రోజుకు ఇంకా పెరుగుతుందన్నారు. పూలకు నీళ్లను శుభ్రం చేసే గుణాలు ఉన్నాయన్నారు. అందుకే మన పూర్వీకులు బతుకమ్మ పేర్చి చెరువుల్లో నిమజ్జనం చేసే అలవాటు తెచ్చినట్టు పేర్కొన్నారు.
ఢిల్లీలో పోరాటం
దేశ రాజధాని ఢిల్లీలో యువత పోరాటం చేస్తోందని, యువత పోరాటానికి కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, అదేవిధంగా ఎన్నికల కమిషనర్ దిగిపోవాలని కొత్త ఉద్యమం జరుగుతోందన్నారు. యువత కరెంట్ ఎఫైర్స్ ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొంత మంది రీల్స్ చూసి గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం ఏర్పడి లవ్ ఎఫైర్స్లో పడుతున్నారని, దీని వల్ల జీవితం అంతా నాశనం అవుతుందని, జరుగుతున్న సంఘటనలను ఆయన వివరించారు. తల్లిదండ్రులకు మించిన శ్రేయోభిలాషులు ఎవ్వరూ లేరన్నారు. వారిని గౌరవించి వారి మాటలు వినాలని సూచించారు. రీల్స్, సోషల్ మీడియా ట్రాప్లో పడొద్దని సూచించారు. ఒక్కసారి జీవితం కోల్పోయిన తర్వాత మళ్లీ తిరిగి రాదన్నారు. మంచిగా చదివి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ రాజనర్స్. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు చిన్న, భూపేష్, ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
రీల్స్కు బానిస కావొద్దు
మాజీ మంత్రి హరీశ్రావు


