హుస్నాబాద్: అనుమతి లేకుండా విద్యుత్‌ను వాడుకున్న విషయంలో మున్సిపల్ కమిషనర్‌కు గురువారం విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన్న బతుకమ్మ వేడుకలకు సంబంధించి దాదాపు 200 ఫ్లడ్ లైట్ల ఏర్పాటుకు విద్యుత్‌ను అక్రమంగా వాడుకున్నందుకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ రూ.20 వేలు చెల్లించాలని నోటీస్‌లో పేర్కొన్నారు. అక్రమ విద్యుత్ వినియోగం పై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): దేవీ నవరాత్రుల సందర్భంగా జిల్లా కేంద్రంలోని లలిత చంద్రమౌళీశ్వర దేవాలయంలో గురువారం కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనంలో కవులు పండరి రాధాకృష్ణ, ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, పెందోట వెంకటేశ్వర్లు, కాల్వ రాజయ్య, బస్వ రాజ్ కుమార్, బత్తిని మౌనస్వామి, డాక్టర్ శైలజ, పద్మలు దేవీ నవరాత్రులపై కవితలు చదివి అలరించారు. అలాగే అవధానంతో పృచ్చకులుగా వరుకోలు లక్ష్మయ్య, డాక్టర్ శైలజ, కాల్వ రాజయ్యలు వ్యవహరించారు. అనంతరం పృచ్చకులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రశంసాపత్రాలు అందజేశారు.
దుబ్బాకటౌన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు మల్లన్నగారి భిక్షపతి అన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం దుబ్బాక పట్టణంలో వికలాంగులకు పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఉపేందర్, దుబ్బాక పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజశేఖర్, దిశా బోర్డు మెంబర్ సుంకోజి ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
వర్గల్(గజ్వేల్): జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం గురువారం వర్గల్ గ్రంథాలయం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. లైబ్రేరియన్ శ్రీనివాస్‌కు పలు సూచనలు చేశారు. అసంపూర్తి దశలో ఉన్న గ్రంథాలయ నూతన భవనం పరిశీలించారు. ఆయా పనులు పూర్తయ్యేలా కృషి చేస్తానని, బుక్స్రాక్స్ తదితర ఫర్నిచర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్, ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, అరవింద్‌రెడ్డి, కృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, దుర్గయ్య ఉన్నారు.


