నాడు ఇంపు.. నేడు కంపు | - | Sakshi
Sakshi News home page

నాడు ఇంపు.. నేడు కంపు

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

సెల్ఫీ ఫొటోలు పంపించాల్సిన ఫోన్‌ నంబర్లు
సమీకృత మార్కెట్‌లో సమస్యల తిష్ట

అధునిక వసతులతో రూ. 22.87కోట్లతో రాష్ట్రానికి తలమాణికంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ మార్కెట్‌ 2019 డిసెంబర్‌ లో అందుబాటులోకి వచ్చింది. మొదట్లో ఈ మార్కెట్‌ను ఆదర్శంగా నడిపారు. ఈ క్రమంలోనే పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యతతో కూడిన కూరగాయలు, పండ్లు, మాంసం అందించడం వల్ల 2024 నవంబర్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా) సర్టిఫికెట్‌ కూడా వచ్చింది. కానీ రానురానూ మార్కెట్‌ ప్రాభవం తగ్గపోతోంది. ప్రత్యేకించి ఆగస్టు 31న పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత పరిస్థితి మరింత అధాన్నంగా మారింది. ప్రత్యేకించి పారిశుద్ద్య నిర్వహణ కరువై తరుచూ ఈ మార్కెట్‌ కంపుకొడుతున్నది. వేతనాలు చెల్లించడం లేదని ఇక్కడ పనిచేస్తున్న 14మంది పారిశుద్ద్య కార్మికులు తరుచూ సమ్మెకు దిగుతున్నారు. ఫలితంగా రోజుల తరబడి ఈ మార్కెట్‌ కంపుకొడుతోంది.

మార్కెట్‌ను సందర్శించిన నేతలు..

తాజాగా గురువారం ఈ మార్కెట్‌ను ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిశెట్టి చందన తదితరులు సందర్శించారు. ఎక్కడ పడితే వ్యర్థాల పారబోత వల్ల కంపుకొడుతున్న పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ కార్యదర్శి ఉషాతో మాట్లాడారు. నాలుగునెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలని సూచించగా.. రెండు నెలల వేతనాల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మార్కెట్‌ను కార్మికులు శుభ్రం చేశారు.

పాలకవర్గం రావాలి..

కొత్త పాలవర్గాన్ని నియమిస్తేనే సమస్యల పరిష్కారానికి బాటలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ మార్కెట్‌ చైర్మన్‌ పదవిని బీసీ(మహిళ)కు కేటాయించారు. త్వరగా పాలకవర్గ నియామకానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

● మార్కెట్‌కు ప్రస్తుతం వస్తున్న ఆదాయానికి, నిర్వహణకు పొంతన లేకుండా తయారయ్యింది. ఈ మార్కెట్‌లో నిర్మించిన స్టాళ్లు, దుకాణసముదాయాల ద్వారా నిజానికి ఈ వనరుల ద్వారా నెలకు రూ.6.50లక్షల ఆదాయం రావాల్సి ఉన్నది. కేవలం 3లక్షల లోపే ఆదాయం వస్తున్నది. మార్కెట్‌ నిర్వాహణ ఖర్చులు, ఆదాయానికి పొంతన లేక రూ.1.60లక్షల వరకు ఇతర నిధుల నుంచి పూడ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. కానీ నెలవారీగా నిర్వహణ ఖర్చులపేరిట రూ.1.60లక్షలకుపైగా భారం పడుతుందని ఏడాదికి వచ్చే సరికి సుమారుగా రూ.20లక్షల భారం మోయాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఈ ముందుభాగం(మార్కెట్‌ రోడ్డు), ఉత్తర రోడ్డు వైపున షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.3కోట్లతో పనులు సాగుతున్నాయి.

నాడు పరిశుభ్రత, నాణ్యతలో మేటి

రెండేళ్ల కిందట ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్‌

పారిశుద్ధ్యలోపంతో కంపుకొడుతున్న మార్కెట్‌

కొనుగోలుదారులు, వ్యాపారులకు తప్పని తిప్పలు

గతంలో పరిశుభ్రత, నాణ్యతలో మేటిగా వర్థిల్లి.. రెండేళ్ల కిందట ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్‌ సేప్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) సర్టిఫికెట్‌ పొందిన గజ్వేల్‌ ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నేడు పారిశుద్ధ్యలోపంతో కంపుకొడుతోంది. మార్కెట్‌ కమిటీ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో సమస్యలపై పట్టింపులేక ఈ దుస్థితి నెలకొన్నది.

– గజ్వేల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement