మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ఒకప్పుడూ వినోద కార్యక్రమాలను వీక్షించేందుకు, పాల్గొనేందుకు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లిన ఈ ప్రాంత వాసులకు చెంతనే నయా ట్రెండ్ వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దండియా ఆటను వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంలో అద్భుతమైన కోమటి చెరువు ఏర్పాటు చేసినట్లు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈవెంట్లకు మంచి వేదికగా అభివర్ణించారు. జాతీయ స్థాయిలో గాన ప్రతిభతో సిద్దిపేట పేరును ఇనుమడింప చేసిన లాస్యను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


