దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్‌లో దాండియా ఈవెంట్లు జరుగుతాయని తెలుసు. ఇప్పుడు సిద్దిపేటలో జరుగుతుండటంతో మేమూ వెళ్తున్నాం. దాండియా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. హైదారాబాద్ నుంచి మా దోస్త్ బిందును తీసుకుని వచ్చా.
– వెన్నెల, శ్రీనగర్ కాలనీ
ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన దాండియాను.. సిద్దిపేటకు తీసుకవచ్చి ప్రత్యేకంగా ఈవెంట్‌ను నవరాత్రి ఉత్సవాల్లో నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్నాం. అక్కచెల్లెలు కిట్టి పార్టీలు నిర్వహిస్తుంటారు. ఫ్యామిలీతో దాండియా నృత్యం వేయవచ్చు. యువత, మహిళలు బాగా ఆదరిస్తున్నారు. డిజే, కలర్ లైట్స్, షాపింగ్‌ను సైతం ఏర్పాటు చేశాం.
– నవీన్ రెడ్డి, ఈవెంట్ ఇన్చార్జి


