హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో గురువారం వినూత్నంగా వృక్ష రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి మాట్లాడుతూ.. వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. విచక్షణారహితంగా అడవులను నరికి వేయడం వల్ల అనేక దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. వలంటీర్లు నాటిన చెట్లకు రాఖీలు కట్టి, ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను పెంచే బాధ్యతను తీసుకున్నారని తెలిపారు. కళాశాల ఆవరణలో 150 మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టిన ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లను అభినందించారు.


