సిద్దిపేట జోన్: పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం అండర్–17 బాలబాలికల విభాగంలో క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 120 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర విభాగంలో చిన్నకోడూరు జట్టు ప్రథమ స్థానంలో, దుబ్బాక జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అలాగే బాలికల విభాగంలోనూ చిన్నకోడూరు ప్రథమ స్థానంలో, తొగుట పాఠశాల జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ఈ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలు నిర్మల్‌లో ఈనెల 29, 30 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.


