నేటి నుంచి జిల్లాలో సభలు
సిద్దిపేటజోన్: ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)ప్రక్రియలో భాగంగా జిల్లాలో నోటీసుల పర్వం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 2,29,433 మందికి నోటీసులు అందించనున్నారు. మ్యాపింగ్ కానీ వాటికి, అనామలిస్ జాబితాలోని వాటికి అధికారులు డిక్లరేషన్ ప్రక్రియ కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వడంతో పాటు మొబైల్ ద్వారా ఫొటోగ్రఫీ ప్రక్రియ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి సభలను నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ముసాయిదా జాబితా ప్రకారం ఓటరు వివరాలను వార్డు. గ్రామ సభలో బూత్ లెవల్ అధికారులు చదివి వినిపించాల్సి ఉంటుంది. ప్రధానంగా చనిపోయిన వారి, అందుబాటులో లేని వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలను సభ సమక్షంలో చదివి వినిపించాలి. మరోవైపు ఫార్మ్ 6, 7, 8 లను అందుబాటులో ఉంచి, ఏదైనా అభ్యంతరాలు వస్తే వాటి వివరాలు నోట్ చేసుకోవాలి. ఇప్పటికే అనామలిస్, మ్యాపింగ్ కానీ జాబితా వివరాలను ఆయా రాజకీయ పార్టీలకు అధికారులు పంపిణీ చేశారు. దింతో రెండు రోజులుగా ఆయా మున్సిపాలిటీల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నోటీసులు జారీ అయినటువంటి జాబితాలపై సమీక్షలు చేపడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1,99,179 ఓటర్లకు అనామాలిస్ కింద అదేవిధంగా 27254 ఓటర్లకు మ్యాపింగ్ కానీ విభాగం కింద మొత్తంగా 2,26,433 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు.
నియోజకవర్గం అనామలిస్ మ్యాపింగ్ కానివి మొత్తం
1. హుస్నాబాద్ 49,217 4,046 53,263
2. సిద్దిపేట 50,062 7,734 57,796
3. దుబ్బాక 38,924 6,704 45,628
4. గజ్వేల్ 60,976 8,770 69,746
1,99,179 27,254 2,26,433


