యూరియా కోసం వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం వినూత్న నిరసన

Aug 27 2026 7:20 AM | Updated on Aug 27 2026 7:20 AM

సెల్‌ఫోన్లు చూపిస్తూ రైతుల ఆగ్రహం

మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం మిరుదొడ్డి మండల పరిధిలోని రైతులు బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సెల్‌ ఫోన్లు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకోవాలన్న నిబంధనలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్‌లో యూరియా బుక్‌ చేసుకునేలోపే నిమిషాల్లోనే యూరియా అయిపోయిందని చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా యాప్‌ వద్దు ఎరువుల దుకాణాల ద్వారానే యూరియా కావాలంటూ నినాదాలు చేశారు. పంటలకు కీలక సమయంలో యూరియా అందకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యాప్‌ విధానాన్ని రద్ధు చేసి నేరుగా యూరియాను అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ వల్లాల సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ రంగనబోయిన రాములు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాగా నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడు సైతం పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement