మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని వెంకట్రావుపేటలో మిరుదొడ్డి ఎకై ్సజ్ సీఐ సునీత ఆధ్వర్యంలో మంగళవారం గ్రామస్తులతో కలిసి మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. రేణుకా ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో ఈత మొక్కలను నాటారు. మొక్కలను నాటి సంరక్షించే విధానంపై గ్రామస్తులకు అవగాహన కల్గించారు. హరిత గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు పాటు పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్సింహారెడ్డి సర్పంచ్ కవిత, నాయకులు స్వామి గౌడ్, ఎకై ్సజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


