పెద్ద పెద్ద మేడలు | - | Sakshi
Sakshi News home page

పెద్ద పెద్ద మేడలు

Aug 26 2026 7:19 AM | Updated on Aug 26 2026 7:19 AM

ఇరుకు గల్లీలు..

హైదరాబాద్‌ ఘటనతోనైనా..

హైదరాబాద్‌లో జరిగిన ఘటనతోనైనా మున్సిపల్‌ అధికారులు మేల్కొంటారా? లేదా అన్న చర్చ జరుగుతోంది. కాసులకు ఆశపడి అక్రమ కట్టడాలపై దృష్టిసారించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అక్రమ కట్టడాలను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో అనుమతులు లేకుండా 48 గజాల్లో ఏడంతస్తుల భవన నిర్మాణం ఈ నెల 22న కూప్పకూలిన విషయం విదితమే. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరగకముందే అధికారులు మేల్కొవాలన్న డిమాండ్‌ సర్వత్రా వినిపిస్తోంది.

నిబంధనలు గాలికి.. అంతస్తులు ౖపైపెకి

హైదరాబాద్‌ ఘటనతోనైనా మేల్కోని జిల్లా యంత్రాంగం

సెట్‌ బ్యాక్‌లు లేకుండానే నిర్మాణాలు

దృష్టిసారించాలంటున్న ప్రజలు

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుండటం క్షేత్రస్థాయిలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు కనిపిస్తున్నా.. చర్యలు మాత్రం నోటీసులకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. నిర్మాణం ప్రారంభం దశలోనే అడ్డుకోవాల్సిన అధికారులు.. భవనం పూర్తయ్యేవరకు వేచి చూస్తున్నారనే విమర్శలున్నాయి. పునాది దశలోనే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుందని స్థానికులు అంటున్నారు. టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందిపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులిస్తే నచ్చినన్ని అంతస్తులు నిర్మించుకునేందుకు అనధికారికంగా సహకరిస్తున్నట్లు సమాచారం. వీరికి కొందరు రాజకీయ నేతల అండదండలూ ఉన్నట్లు ప్రచారం.

ముందుగా మేల్కొనాలి

ప్రతి భవనానికీ అనుమతులు ఉన్నాయా? అనుమతించిన విస్తీర్ణం ఎంత? నిర్మించిన అంతస్తులు ఎన్ని? ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? అత్యవసర వాహనాలు వెళ్లేందుకు మార్గం ఉందా? అన్న అంశాలను పరిశీలించాలి. అక్రమ నిర్మాణాలు పూర్తయిన తర్వాత కూల్చివేతలు చేపట్టడంకంటే.. నిర్మాణం ప్రారంభ దశలోనే అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇరుకు గల్లీల్లో ఆస్పత్రులు

సిద్దిపేట పట్టణంలో భరత్‌నగర్‌, పారిపల్లి స్ట్రీట్‌, శివాజీనగర్‌, సుభాష్‌ రోడ్డు, బొర్ర హనుమాన్‌ గల్లీలలో ఎక్కువగా ఆస్పత్రులు, బట్టల దుకాణాలు కొనసాగుతున్నాయి. దీంతో చిన్న స్థలాలను సైతం వదలకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీలలో 75 గజాల్లోపు స్థలాలకు మున్సిపాలిటీ అనుమతుల విషయంలో వెసులుబాటు ఉండటంతో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఒకప్పుడు నివాస ప్రాంతాలుగా ఉన్న ఈ ప్రాంతాలు ఇప్పుడు ఎక్కువగా వాణిజ్య భవనాలతో నిండిపోతున్నాయి. అయితే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువగా అంతస్తులు నిర్మించడం వల్ల జనసాంద్రత పెరగడంతో అత్యవసర సమయంలో అంబులెన్సులు వెళ్లేందుకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సిద్దిపేట పట్టణం సుడా కార్యాలయం సమీపంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఈ ఏడాది ప్రారంభమైంది. ఈ భవనానికి మున్సిపల్‌ అనుమతులు తీసుకున్నారు. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా నిర్మించారు. అగ్నిమాపక వాహనం తిరిగేందుకు వీలుగా భవనం చుట్టూ దాదాపు 4మీటర్ల స్థలాన్ని వదిలిపెట్టాలి. అలాగే భవనం కూడి వైపు, వెనుకవైపు సెట్‌బ్యాక్‌ వదలలేదు. మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

డీటీఎఫ్‌ను ఏర్పాటు చేస్తున్నాం

అక్రమ కట్టడాలను గుర్తించేందుకు డీటీఎఫ్‌ టీం ఏర్పాటు చేస్తున్నాం. ఏరియా మేరకు సెట్‌ బ్యాక్‌కు వదిలిపెట్టి ఇంటి నిర్మాణం చేసుకోవాలి. అగ్నిమాపక వాహనం తిరిగే విధంగా చుట్టూ వదలాలి. నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేయకపోతే ఓసీలు సైతం ఇవ్వడం లేదు.

– మల్లికార్జున్‌, ఇన్‌చార్జి కమిషనర్‌, సిద్దిపేట మున్సిపాలిటీ

హైదరాబాద్‌లోనే కాదు.. జిల్లాలోని మున్సిపాలిటీలలోనూ అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నిర్మాణ సమయంలో పాటించాల్సిన నిబంధనలు అటకెక్కిస్తున్నారు. బహుళ అంతస్తుల చుట్టూ కనీసం అగ్నిమాపక వాహనం తిరిగేందుకు కూడా స్థలాన్ని వదిలి పెట్టడం లేదు. ఇరుకు గల్లీల్లో పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్‌ పట్టణాల్లో కొన్ని చోట్ల అతి తక్కువ విస్తీర్ణంలో రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్నారు. కనీసం తనిఖీలు చేసి కట్టడి చేసేవారే లేరు. –సాక్షి, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement