మాజీ మంత్రి హరీశ్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సహనం, శాంతి, దయ, సోదరభావాన్ని ప్రవక్త చాటారని ఆయన కొనియాడారు. మహమ్మద్ ప్రవక్త ప్రజలకు ఐక్యత, మానవ సేవ సందేశాన్ని అందించారన్నారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు, మత సామరస్యం సమాజానికి ఆదర్శమన్నారు. అల్లా దయతో ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
గజ్వేల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నియోజకవర్గ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు, దిలాల్‌పూర్ సర్పంచ్ వెంకన్నగారి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ గొప్ప పరివర్తనకు నాంది పలికిందన్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే రేషన్ కార్డులు అందుతున్నాయని చెప్పారు. కాగా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.


