పూజల పేరుతో ఇద్దరి కిడ్నాప్‌ | - | Sakshi
Sakshi News home page

పూజల పేరుతో ఇద్దరి కిడ్నాప్‌

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

12 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

కొండపాక(గజ్వేల్‌): పూజల పేరుతో నమ్మించి ఇద్దరిని కిడ్నాప్‌ చేసిన ఘటన కుకునూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. 12 గంటల్లో నే పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి బాధితులను రక్షించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగ ర్‌ జిల్లా గన్నేరువరానికి చెందిన మఠం శ్రీనివాస్‌, అనిల్‌, శివశంకర్‌లు పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో 15 రోజుల కిందట కల్వకుర్తి జూపల్లి గ్రామంలో పూజలు చేయాలంటూ శివ, పర్వతాలు ఫోన్‌ చేయగా వీరు వెళ్లి పూజలు చేశారు. ఈనెల 22న కొమురవెల్లి దేవస్థానం వద్ద మళ్లీ పూజలు చేయాలంటూ శివ, పర్వతాలు అనే వ్యక్తులు అనిల్‌కు ఫోన్‌ చేసిరమ్మన్నారు. దీంతో అనిల్‌, రాజు, శ్రీనివాస్‌లు కారులో అదే రోజు మధ్యాహ్నం కొమురవెల్లి కమాన్‌ వద్దకు చేరుకున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తితో పాటు మరి కొందరు కలిసి పూజలు చేసేందుకు వెళ్లిన ముగ్గురిపై దాడి చేశారు. రూ. 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తూ కిడ్నాప్‌ చేసి హై దారాబాద్‌ వైపునకు తీసుకె ళ్లారు. కిడ్నాప్‌కు గురైన వారిలో శ్రీనివాస్‌ తప్పించుకొని కుటుంబీకులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వారు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన వెంటనే ఎస్‌ఐ బాలకృష్ణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కిడ్నాప్‌నకు గురైన వ్యక్తులు నాగర్‌కర్నూల్‌ జిల్లా వైపు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మరో నలుగురు పోలీసులను వెంటబెట్టుకొని వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన కిడ్నాపర్లు ఇద్దరు వ్యక్తులకు వదిలేసి పారిపోయారు. దీంతో రాజు, అనిల్‌లను కుటుంబీకులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. కిడ్నాపర్లను త్వరలో పట్టుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement