మహారాష్ట్ర తెలుగులో మన పాఠం | - | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర తెలుగులో మన పాఠం

Aug 22 2026 7:13 AM | Updated on Aug 22 2026 7:13 AM

మహారాష్ట్ర తెలుగులో మన పాఠం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మహారాష్ట్ర పాఠ్యపుస్తకంలో సిద్దిపేటకు చెందిన ప్రముఖ కవి, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు చొప్పదండి సుధాకర్‌ రచనకు చోటు లభించింది. మహారాష్ట్రలో తెలుగు రెండో భాషగా విద్యార్థులు అభ్యసిస్తారు. దీంతో 6వ తరగతి పాఠ్యపుస్తకంలో సుధాకర్‌ రచించిన మన చేతుల్లో మన ఆరోగ్యం రచనను పాఠ్యాంశంగా చేర్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన చొప్పదండి సుధాకర్‌ 30 ఏళ్లుగా కవిగా, రచయితగా కొనసాగుతున్నారు.

సిద్దిపేట కవి రచనకు చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement