‘పార్థినియం’ నిర్మూలిద్దాం | - | Sakshi
Sakshi News home page

‘పార్థినియం’ నిర్మూలిద్దాం

Aug 21 2026 9:44 AM | Updated on Aug 21 2026 9:44 AM

అనర్థాలు నివారిద్దాం

అనర్థాలు నివారిద్దాం

వర్గల్‌(గజ్వేల్‌): మానవాళి ఆరోగ్యానికి, పంటలకు, పశుసంపదకు చేటుకలిగించే పార్థినియం కలుపు మొక్కల నిర్మూలనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌ విద్యా ర్థులు పిలుపునిచ్చారు. గురువారం నెంటూరులో రూరల్‌ అగ్రికల్చరల్‌ వర్క్‌ ఎక్స్‌పీరియనన్స్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా వర్సిటీ విద్యార్థు లు తేజశ్రీ, లావణ్య, వైష్ణవి, లక్ష్మీప్రియ, కీర్తన, గ్రీష్మశ్రీ బృందం సర్పంచ్‌ నాగరాజు, హెచ్‌ఎం కనకరాజు ఆధ్వర్యంలో స్కూల్‌ విద్యార్థులతో కలిసి సామూహిక పార్థీనియం కలుపుమొక్కల నిర్మూలన కార్యక్రమం చేపట్టారు. ఈ మొక్కతో మానవాళి అలర్జీలు, శ్వాసకోశ వ్యాధుల బారినపడతారని, పంటలకు, పశుసంపదకు ఎంతో నష్టం కలిగిస్తుందన్నారు. మొక్కలను చిన్న దశలోనే గుర్తించి తొలగించాలని, వాటి విత్తనాలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామస్తులు, విద్యార్థులతో కలిసి గ్రామంలోని వివిధ ప్రదేశాల్లో విస్తరించిన పార్థినియం మొక్కలను తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement