ప్రయాణ చెంత.. | - | Sakshi
Sakshi News home page

ప్రయాణ చెంత..

Aug 21 2026 9:44 AM | Updated on Aug 21 2026 9:44 AM

ప్రమాదం చింత ● ‘సాయంత్రమైంది.. రేపు ఉదయం పోదాం..’ వరుసకు సోదరుడు రవితో పాటు బంధువులు చెప్పినా వినలేదు.. ‘ఉదయం పని ఉంది’ అంటూ రవి కాళ్లుమొక్కి.. కారులో రాజు కుటుంబ సభ్యు లు బయలు దేరారు. ఇవే రాజు చివరి మాటలు.. ● మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటాం.. తెల్లవారు లేచి యథావిధిగా పని చేసుకుందామని ఆ కుటుంబం భావించింది. అంతలోనే మూల మలుపులో మృత్యురూపంలో ఉన్న బావి కబళించింది. – సాక్షి, సిద్దిపేట/ దుబ్బాక

8వ పేజీలో u

ప్రమాదం చింత

తోర్నాల

బంధువు దశ దినకర్మకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం అప్పనపల్లిలో జరిగిన విషాదకర ఘటనలో దంపతులు, ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృత్యువాత పడ్డారు. దుబ్బాక మండలం బల్వంతపూర్‌కు చెందిన రాజు ఇసుక వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి రాజు సిద్దిపేటలోని వడ్డెర కాలనీలో బంధువు (వరుసకు బావ) దశదినకర్మకు బుధవారం హాజరయ్యారు. తిరిగి సాయంత్రం కారులో (టీఎస్‌02ఈఎఫ్‌ 7997) ఇంటికి బయలు దేరారు. తోర్నాల మీదుగా బల్వంతాపుర్‌కు వెళ్తున్న క్రమంలో అప్పనపల్లి దాటిన తర్వాత మూల మలుపు దగ్గర అదుపు తప్పి (డ్రైవర్‌కు) కుడి వైపు ఉన్న వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది.

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌తో

సిద్దిపేట నుంచి సుమారు సాయంత్రం 5గంటలకు బయలు దేరిన రాజు కుటుంబం స్వగ్రామం బల్వంతాపూర్‌కు రాత్రి 8గంటలైనా చేరుకోలేదు. దీంతో సోదరుడు ఫోన్‌ చేస్తే సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తెలిసిన వారందరికీ ఫోన్లు చేశారు. రాలేదు అని చెప్పడంతో చివరకు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ రాజేష్‌, ఎస్‌ఐ కీర్తిరాజులు అప్రమత్తమయ్యారు. సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్‌ ఆధారంగా అప్పనపల్లి శివారు దాటే వరకు మాత్రమే చూపిస్తోంది. అక్కడి నుంచి ఫోన్‌ సిగ్నల్‌ లేదు. పోలీసులు, కుటుంబ సభ్యులు దారి వెంట చెక్‌ చేస్తుండగా అర్ధరాత్రి 12గంటలకు బావిలో పడిపోయి ఉన్న కారు గుర్తించారు. ఫైర్‌ అధికారులు, పోలీసులు క్రేన్‌ను సహాయంతో గురువారం తెల్లవారుజామున 4గంటలకు కారును బయటకు తీశారు.

బయటకు వచ్చేందుకు ప్రయత్నం

మరో 8కిలో మీటర్లు అయితే ఇంటికి చేరుకుంటాం అనుకున్న వీరికి ఊహించని పరిణామం ఎదురైంది. కారులో ఉన్న కుటుంబం ఉక్కిరిబిక్కిరైంది. క్షణాల వ్యవధిలోనే నలుగురు నీట మునిగి శవాలుగా మారారు. రాత్రి సమయం కావడంతో ఈ మార్గం గుండా రాకపోకలు తక్కువగా సాగుతుంటాయి. కారు బావిలో పడినప్పుడు ఎవరైనా చూసిఉంటే చనిపోయే వారు కాదని.. స్వల్ప గాయాలతో బయటపడేవారని పలువురు చర్చించున్నారు.

అప్పనపల్లి శివారులో బావిలోకి దూసుకెళ్లిన కారు

భార్యభర్తలు, కుమారుడు, కూతురు మృతి

దశదినకర్మకు వెళ్లి వస్తుండగా ఘటన

కుటుంబానికి శాపంగా మారిన నీళ్లు..

బాధిత కుటుంబానికి నీళ్లు శాపంగా మారాయి. రాజు తల్లి కనకవ్వ 4 నెలల క్రితమే పొలానికి మోటార్‌ ద్వారా నీళ్లు పెట్టేందుకు వెళ్లి కరెంట్‌ షాక్‌తో కెనాల్‌నీళ్లలో పడి మృతి చెందింది. తండ్రి దుర్గయ్య ఐదేళ్ల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా రాజు కుటుంబం సైతం బావిలోనే మునిగి చనిపోవడం శోచనీయం.

సిద్దిపేట వడ్డెర కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement