సిద్దిపేటఅర్బన్: మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌గాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పొన్నాల శివారులోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. హరికృష్ణ మాట్లాడుతూ రాజీవ్ సేవలు చిరస్మరణీయమన్నారు. దేశంలో సమాచార, సాంకేతిక రంగాల అభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నాయకుడు అని అన్నారు. సాంకేతిక సంస్కరణల కారణంగానే భారతదేశం నేడు ఐటీ రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంప మహేందర్, అత్తుఇమామ్, ఆత్మ కమిటీ చైర్మన్ గోపీకృష్ణ, యాదగిరి, కలీముద్దీన్, దాస అంజయ్య, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


