విద్యార్థి ఉద్యమాలపై అణచివేత తగదు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఉద్యమాలపై అణచివేత తగదు

Aug 21 2026 9:44 AM | Updated on Aug 21 2026 9:44 AM

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క

సిద్దిపేటకమాన్‌: విద్యార్థి ఉద్యమాలపై అణచివేత తగదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన 50 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సర్కారు బడులు మూసివేత అంటే పేద విద్యార్థులకు చదువులను దూరం చేయడమే అన్నారు. ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. పీడీఎస్‌యూ స్థాపించ నుంచి నేటి వరకు పోరాటాల పునాదులపై నడిచిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో పీడీఎస్‌యూ ఒక చరిత్రాత్మక బాటలోనే నడిచిందన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులు తిరుపతి, విష్ణు, నాగరాజు, స్వామి, శనిగరం సత్యనారాయణ, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

పరామర్శ...

గజ్వేల్‌రూరల్‌: టీయూడబ్ల్యూజే(తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టు)ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీని విమలక్క పరామర్శించారు. ఈ సందర్భంగా బాషారత్‌ ఉన్నిసాబేగం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విరాహత్‌అలీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్యతో పాటు పలువురు నాయకులు విరాహత్‌ అలీని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement