తోటపల్లిలో కొత్తరాతి యుగం ఆనవాళ్లు | - | Sakshi
Sakshi News home page

తోటపల్లిలో కొత్తరాతి యుగం ఆనవాళ్లు

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

తోటపల్లిలో కొత్తరాతి యుగం ఆనవాళ్లు

హుస్నాబాద్‌రూరల్‌: మండలంలోని తోటపల్లి శివారు గుడిబండ దేవాలయం సమీపంలో ఆదిమానవులు ఆహార సేకరణలో రాతి పనిముట్లను నూరుకున్న సూరుడు గుంతలను చరిత్ర పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్‌ బుధవారం గుర్తించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తరాతి యుగం నాటి ఆదిమానవులు రాతితో పనిముట్లు తయారు చేసుకొని జీవనం సాగించేవారన్నారు. రాతి పని ముట్లతో వ్యవసాయం, వేట సాగించేవారని, గుడి బండ మీద 30కి పైగా (గూవ్స్‌) రాతి పనిముట్లు నూరిన గుంతలు ఉన్నాయన్నారు. ఇక్కడే ఒక డోల్మెన్‌ సమాధిని పోలిన ఆకృతి ఉందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement