ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగిరం చేయండి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ వేగిరం చేయండి

Aug 20 2026 7:20 AM | Updated on Aug 20 2026 7:20 AM

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

సిద్దిపేటరూరల్‌: రెండో దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ఇందిరమ్మ ఇళ్ల గెజిటెడ్‌ ఆఫీసర్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియపై జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వెరిఫికేషన్‌ ప్రక్రియ యుద్ధ ప్రాతిపాదకన పూర్తి చేయాలని ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ ఏఈ లను ఆదేశించారు. గ్రామాల వారీగా వారి ప్రస్తుత ఇంటి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. విచారణ పూర్తయిన వెంటనే మంజూరు కోసం కలెక్టరేట్‌ కి సమర్పించాలన్నారు.

సిద్దిపేటకమాన్‌: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని జ్యుడీషియల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్‌ దేశ్‌పాండే, రాష్ట్ర కార్యదర్శి కరుణశ్రీలు తెలిపా రు. ఈనెల 23న జరగనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వారు బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు దేవరాజ్‌, న్యాయశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement