చిన్నకోడూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి’ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ మండల పరిధిలోని పెద్దకోడూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ విద్యార్థినులు బుధవారం రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీరి ధర్నాకు బీఆర్‌ఎస్వీ నాయకులు మద్దతుగా నిలిచారు. విద్యార్థి నాయకులు రెడ్డి యాదగిరి, విద్యార్థినులు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను ఇతర నైపుణ్య శిక్షణా కార్యక్రమాలతో విలీనం చేయడం వల్ల డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జీఓ 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. విద్యార్థుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.
పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట
పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన


