హంతకురాలు రాజమణి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హంతకురాలు రాజమణి అరెస్ట్‌

Aug 19 2026 9:04 AM | Updated on Aug 19 2026 9:04 AM

హుస్నాబాద్‌: కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ కోటి వెంకటేశ్వర్లను హత్య చేసిన కేసులో భార్య రాజమణి అరెస్ట్‌ అయ్యారు. సీఐ శ్రీధర్‌ తెలిలిన వివరాలిలా ఉన్నాయి. వెంకటేశ్వర్లకు రాజమణికి 35 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దాదాపు 15 ఏళ్ల కిత్రం భర్త వెంకటేశ్వర్లు.. భార్య రాజమణి, పిల్లలను దూరంగా ఉంచి మరొక మహిళను రెండో వివాహం చేసుకొని ఆమెతోనే ఉంటున్నారు. భర్త పదవీ విరమణ సందర్భంగా లభించే ప్రయోజనాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను రెండో భార్యకు అందజేయాలని నిర్ణయించుకున్నారు. తనను, తన పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారనే కోపంతో హత్య చేసినట్లు నేరస్తురాలు ఒప్పుకున్నారు. నేరస్తురాలు రాజమణిని హుస్నాబాద్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచినట్లు సీఐ శ్రీధర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement