సిద్దిపేటకమాన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లా రెస్పాన్స్ టీమ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట పట్టణం లింగారెడ్డిపల్లి బస్తీ దవాఖానను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఇందిరమ్మ కాలనీలో జ్వర సర్వేతో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో స్ప్రేయింగ్, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు డెంగీ, మలేరియా వ్యాధులపై అవగహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ ధనరాజ్


