పంద్రాగస్టు వేడుకలకు
సిద్దిపేటకమాన్: స్థానిక పోలీసు కమిషనరేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. మంత్రి పొన్నం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ పరిశీలించనున్నారు. జిల్లా పురోగతిపై మంత్రి తన సందేశం ద్వారా వివరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న కార్యక్రమానికి హాజరుకానున్న వీఐపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి పొన్నం
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
సిద్దిపేటకమాన్: పంద్రాగస్టు వేడుకలు జరగనున్న పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి శుక్రవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జాతీయ సమైక్యత ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా వరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ సదానందం, తహసీల్దార్ హరికిరణ్ అధికారులు పాల్గొన్నారు.


