హుస్నాబాద్‌రూరల్: మండల పరిధిలోని తోటపల్లి శివారులో సర్వే నంబరు 444లో ప్రభుత్వ భూమిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వ భూములను సర్వే చేసి ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకొవడానికి రెవెన్యూ అధికారులు భూ సర్వే చేస్తున్నారు. శుక్రవారం అధికారులను రైతులు అడ్డుకోవడంతో సర్వే చేయకుండా వెనుతిరిగి వెళ్లారు. ఇండస్ట్రీయల్ పార్కు సమీపంలోనే ప్రభుత్వ భూమి ఉండటంతో ఇక్కడ వ్యవసాయ మార్కెట్ గోదాముల నిర్మాణం ఉపయోగపడుతుందని అధికారులు భూ సర్వే చేస్తున్నారు. సర్వే నంబరు 444లో ఇదివరకే 3 ఎకరాలను పేదలకు అసైన్డ్ పట్టాలు ఇవ్వడంతో రైతులు సాగు చేసుకుంటున్నారు. మా జీవనాధారమైన భూములను ఏట్లా తీసుకుంటారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


