కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికై న ప్రజావాణి కార్యక్రమాన్ని బోనాల పండుగ దృష్ట్యా సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కె. హైమావతి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించిన ఎవరూ ప్రజావాణి దృష్ట్యా కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు. ఆ తర్వాత సోమవారం యథావిధిగా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు.
స్వదేశానికి వచ్చిన
మాజీ ఎమ్మెల్యే రసమయి
ఘనస్వాగతం పలికిన బీఆర్‌ఎస్ శ్రేణులు
బెజ్జంకి(సిద్దిపేట): అమెరికా పర్యటన ముగించుకుని శనివారం హైదరాబాద్ వచ్చిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు మండల బీఆర్‌ఎస్ నాయకులు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, లక్ష్మణ్, శేఖర్‌బాబు, స్వామి, రాజు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
పంటపొలాలకు వెళ్లే దారిని
ఆక్రమణ చేస్తున్నారని గ్రామస్తుల ఆగ్రహం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం జప్తిశివనూర్ జాతీయ రహదారిని అనుకుని ఉన్న మాజీమంత్రి షబ్బీర్ అలీ గెస్ట్‌హౌజ్ వద్ద నిర్మిస్తున్న ప్రహారీని గ్రామస్తులు ధ్వంసం చేశా రు. పంటపొలాలకు వెళ్లేదారిని ఆక్రమించి గోడ నిర్మాణం చేపట్టడంతో గ్రామస్తులు ఆగ్రహంతో గోడను కూలగొట్టారు. జాతీయ రహదారి నుంచి చెరువుకట్టపై తాము పంటపొలాలకు వెళ్లేందుకు దారి ఉందని తెలిపారు. ఇంతకుముందు కూడా ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని చెప్పినా వినకుండా అడ్డుగోడ పెట్టారని చెప్పారు. దీంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రహారీని ధ్వంసం చేశారు.
వడ్డెరల ఉపాధికి
అనుమతులివ్వాలి
కొల్చారం(నర్సాపూర్): వడ్డెరల ఉపాధికి ప్రభుత్వం చట్టపరమైన అనుమతి ఇవ్వాలని మెదక్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు దండుగుల దుర్గ సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని పోతంశెట్టిపల్లి చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు ఓర్స ఈశ్వర్ అధ్యక్షతన శనివారం జిల్లా వడ్డెరల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాయిలు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి తమ కుటుంబాలు రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం రాయి కొట్టే వృత్తికి అడ్డంకులు ఏర్పడటంతో వడ్డెర కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.


