జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య
గజ్వేల్: ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసమే ఎఫ్‌ఎఫ్‌ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్టిలైజర్ సేల్స్)యాప్‌ను తీసుకొచ్చినట్లు జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి మల్లయ్య పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని శ్రీనివాస ట్రేడర్స్, శారదా ట్రేడర్స్, తెలంగాణ అగ్రోస్ ఫర్టిలైజర్స్ దుకాణాల్లో శనివారం యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..యూరియా, డీఏపీ, ఎంఓపీ ఎరువులను యాప్ ద్వారా అందిస్తున్నామన్నారు. బుకింగ్ విధానంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అధికారులు, ఫర్టిలైజర్స్ యాజమానులు రైతులకు సహకరించాలని ఆదేశించారు.


