మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లోకి... | - | Sakshi
Sakshi News home page

మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లోకి...

Aug 8 2026 8:37 AM | Updated on Aug 8 2026 8:37 AM

కొండపాక(గజ్వేల్‌): మండలంలోని పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు మంత్రి వివేక్‌ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కొండపాక మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి , పార్టీ మండల అధ్యక్షుడు మంచాల కనకరాములు ఆధ్వర్యంలో ఖమ్మం పల్లి సర్పంచ్‌ కర్ణాకర్‌ రెడ్డి, రాంపల్లి సర్పంచ్‌ బొమ్మ మల్లయ్య లతో పాటు పలువురు వార్డు సభ్యులు, పలు గ్రామాల బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చేరారు. వీరికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రణీత్‌ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వాసరి లింగరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గజవెల్లి సుదర్శన్‌, బందారం సర్పంచ్‌ కొలుపుల గంగాధర్‌ , వెలుకట్ట గ్రామ సర్పంచ్‌ మానస సురేందర్‌ రావు, జప్తి నాచారం సర్పంచ్‌ పావని శశిధర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వడ్లకొండ రాజు, అడ్వకేట్‌ రాజు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement