సిద్దిపేటఎడ్యుకేషన్: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లోని పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్‌లో ిసిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ర్యాంకులు సాధించారు. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన జ్యోతి ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 5వ, సాయితేజ ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో 16వ, ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో అనూష 28వ, ఎమ్మెస్సీ డేటా సైన్స్‌లో మధు 31వ, ఎమ్మెస్సీ బాటనీలో ఆర్ వర్ష 38వ, ఎంఏ చరిత్రలో అంజిరెడ్డి 39వ, మైక్రోబయాలజీలో ఎండీ సాధిక్ 39వ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
మనోహర్‌కు 50వ ర్యాంక్
దుబ్బాక: పీజీ ప్రవేశ పరీక్షలో దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన మనోహర్ రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఇంగ్లిష్ విభాగంలో స్టేట్ 50 ర్యాంక్ సాధించారు. వంద మార్కులకుగాను 60 మార్కులు వచ్చాయి.
అనూష (28వ ర్యాంకు)
అంజిరెడ్డి (39వ ర్యాంకు)
జ్యోతి (5వ ర్యాంకు)
సాయితేజ (16వ.. )


