దుబ్బాకలో వైభవంగా మహంకాళమ్మకు బోనాలు
దుబ్బాక: పోతరాజుల విన్యాసాలు..శివసత్తుల పూనకాలు..డప్పు చప్పు ళ్లు.. యువకుల కేరింతల మధ్యన శనివారం రాత్రి దుబ్బాక పట్టణంలో మహంకాళమ్మకు బోనాల ఊరేగింపు వైభవంగా జరిగింది. పట్టణంలోని రెడ్డి సంఘాలు, మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు తీశారు. సాయంత్రం 6 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చిన బోనాలు పట్టణంలోని ప్రధానవీధుల గుండా మహంకాళమ్మ ఆలయంకు రాత్రి 8.30 వరకు చేరుకున్నాయి. మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో మహంకాళమ్మ బోనాల ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. అదేవిధంగా పట్టణంలో పోచమ్మ బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.
ఎంపీ రఘునందన్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి పూజలు
ఉత్సవాల్లో ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరాం సంగీతతోపాటు కౌన్సిలర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


