అపరిచిత వ్యక్తులతో అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

అపరిచిత వ్యక్తులతో అప్రమత్తం

Aug 2 2026 7:26 AM | Updated on Aug 2 2026 7:26 AM

● కమిషనరేట్‌ పరిధిలో ఆన్‌లైన్‌ ఫ్రెండ్‌ షిప్‌ పేరుతో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? ● కమిషనరేట్‌ పరిధిలో ఓ అమ్మాయి గుర్తుతెలియని వ్యక్తితో ఆన్‌లైన్‌లో స్నేహం ఏర్పడింది. నిందితుడు తన అవసరాల కోసం ఆ అమ్మాయి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరగా నిందితుడు గతంలో ఆ అమ్మాయితో తనకున్న పరిచయాన్ని మహిళకు చెందిన గ్రామంలో తెలిసేలా ఆన్‌లైన్‌లో పోస్టులు చేసి పెళ్లి రద్దు చేశాడు. ఇలాంటి ఘటనలు సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ● ఆన్‌లైన్‌లో మోసాలు ఎలా చేస్తున్నారు? ● ఆన్‌లైన్‌లో మన ప్రొఫైల్‌ను ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేసి మన సన్నిహితులను అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతుంటారు. మరికొంతమంది ఎన్‌ఆర్‌ఐ పెళ్లి సంబంధం అని, మరికొందరు విలువైన బహుమతులు పంపిస్తూ తర్వాత పెద్ద మొత్తంలో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతుంటారు. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో కూడా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో ఫ్రెండ్‌షిప్‌ చేసి వారికి ఫొటోలు పంపిస్తే వాటిని మార్ఫింగ్‌ చేసి భవిష్యత్‌లో డబ్బులు పంపించకపోతే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని కొంతమంది దుండగులు బెదిరిస్తుంటారు. అలాంటి గుర్తు తెలియని వారి పట్ల ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలి.

వ్యక్తిగత, కుటుంబ వివరాలు పోస్ట్‌ చేయకూడదు మహిళలు, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి ‘సాక్షి’ ఇంటర్వ్యూలో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌

ఎలాంటి జాగ్రత్తలు

తీసుకోవాలి?

గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, సోషల్‌ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మేసేజ్‌లకు స్పందించకూడదు. వారి నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను కూడా యాక్సెప్ట్‌ చేయకూడదు. సోషల్‌ మీడియాలో వచ్చే ఏ ప్రొఫైల్‌ను గుడ్డిగా నమ్మకూడదు. మహిళలు, అమ్మాయిలు తమ పేర్లు, వ్యక్తిగత, కుటుంబ ఫొటోలు, వివరాలు, ఫోన్‌ నంబర్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదు.

సిద్దిపేటకమాన్‌: ఇటీవల కమిషనరేట్‌ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తితో ఆన్‌ఆర్‌ఐ అంటూ ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకుని వలపు వలలోకి దించి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఉన్నత చదువులు చదివిన ఓ అమ్మాయి నుంచి డబ్బులు కాజేసి ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడ్డాడు. జిల్లాలో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ప్రజలు ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారు పంపే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్‌ చేయకూడదని, ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు వారి వ్యక్తిగత, కుటుంబ వివరాలు, ఫొటోలు, ఇతర వివరాలు పోస్ట్‌ చేయకూడదని సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్రీనివాస్‌తో ‘సాక్షి’ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు.

పెరిగిపోతున్న ఆన్‌లైన్‌ మోసాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement