● మాతా శిశు సంరక్షణ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మీనా ● గజ్వేల్ ఎంసీహెచ్‌లో తల్లిపాల వారోత్సవాలు
గజ్వేల్: తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా మాతా శిశు సంరక్షణ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మీనా పేర్కొన్నారు. గజ్వేల్‌లోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్)లో శనివారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలకు ఆమె హాజరై మాట్లాడారు. తల్లిపాలలోనే శిశువులకు అన్ని రకాల పోషకాలు దొరుకుతాయని, ప్రతీ తల్లి తమ పిల్లలకు ఆరు నెలలపాటు తప్పనిసరిగా తల్లిపాలే తాగించాలన్నారు. గైనకాలిజిస్ట్ డాక్టర్ త్రివేణి మాట్లాడుతూ..బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకట్టపడుతుందని చెప్పారు.
ముర్రుపాలే అమృతం
సిద్దిపేటకమాన్: అప్పుడే పుట్టిన శిశువులకు ముర్రుపాలు అమృతంతో సమానమని ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రపంచ తల్లి పాల వారోత్సవాలను ఆగస్టు 1నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు.


