స్నేహితులే మన ధైర్యం, ఆత్మవిశ్వాసం
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్న విద్యార్థినీ, విద్యార్థులు
డబ్బుతో కొనలేనిది
కష్టసుఖాల్లో తోడుగా నిలిచే స్నేహితులు జీవితంలో గొప్ప సంపద. డబ్బుతో కొనలేని అమూల్యమైన బంధం. నిజమైన స్నేహం నమ్మకం, నిజాయితీ, పరస్పర గౌరవంపై నిలబడుతుంది. స్నేహాన్ని ఎప్పుడూ స్వార్థం కోసం కాకుండా ప్రేమ, ఆప్యాయతతో కొనసాగించాలి.
–సుష్మ, డిగ్రీ విద్యార్థిని, సిద్దిపేట.
మంచి స్నేహితులు మార్గదర్శకులు
మంచి స్నేహితులు మన జీవితాన్ని సరైన దిశలో నడిపించే మార్గదర్శకులు. నమ్మకంగా ఉండి మన విజయాలను చూసి సంతోషించే స్నేహితుడు ఉంటే జీవితంలో ఎంతటి విజయాలనైనా అలవోకగా సాధించేందుకు వీలుంటుంది.
–సంతోష్, డిగ్రీ, ఎంపీసీఎస్, సిద్దిపేట.


