● తెలంగాణ గ్రామీణ బ్యాంకు చైర్మన్ ప్రతాప్‌రెడ్డి ● టీజీబీ మెగా రుణమేళాలో వ్యవసాయ యంత్రాలు అందజేత
సిద్దిపేటకమాన్: తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకు ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నట్లు టీజీబీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మెగా రుణమేళా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ ప్రతాప్‌రెడ్డి సిద్దిపేట, మెదక్ జిల్లాలకు చెందిన రైతులకు 20ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రెండు జేసీబీలు, మహిళా సంఘాలకు 50పశువుల యూనిట్లను రుణాలు పొందిన వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకు ద్వారా అందిస్తున్న ప్రభుత్వ పథకాలైన ఎఐఎఫ్, సోలార్ కుసుమ్ వంటివి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వాహనాలు యాంత్రీకరణను ప్రోత్సహించడంలో, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, కూలీల కొరతను అధిగమించడంలో కీలక అడుగుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.


