అంకితభావంతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

అంకితభావంతో విధులు నిర్వర్తించాలి

Jul 30 2026 7:30 AM | Updated on Jul 30 2026 7:30 AM

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌

గజ్వేల్‌రూరల్‌: విధి నిర్వహణలో పోలీసు అధికారులు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌ పేర్కొన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లోని పరిసరాలను పరిశీలించి, ప్రహరీగోడపై ప్రజలకు అవగాహన కల్పించేలా వేసిన చిత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్టేషన్‌కు వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే పోలీసు శాఖకు మంచిపేరు వస్తుందన్నారు. బీట్‌ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతీ గ్రామంలో సీసీకెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ వాటిని ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం రికార్డులను, దర్యాప్తులో ఉన్న కేసులను పరిశీలించి, స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్‌ కోర్టును ప్రారంభించారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలనిన్నారు. కార్యక్రమంలో గజ్వేల్‌ ఏసీపీ నరసింహులు, సీఐ రవికుమార్‌, సీసీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ, ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement