ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్సీ యాదవరెడ్డి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్సీ యాదవరెడ్డి

Jul 30 2026 7:18 AM | Updated on Jul 30 2026 7:18 AM

గజ్వేల్‌: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి సూచించారు. గజ్వేల్‌లో బుధవారం జరిగిన మండల పరిషత్‌ సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. గజ్వేల్‌ మండల ప్రత్యేకాధికారి సువర్ణ మాట్లాడుతూ..ప్రభుత్వ ఆశయాలకనుణంగా అధికారులు పనిచేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement