● తీరు మారకుంటే కలెక్టరేట్ ముట్టడి ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: దుబ్బాక అభివృద్ధి విషయంలో జిల్లా అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని..అధికారుల తీరు మారకుంటే కలెక్టరేట్ ముట్టడికై నా వెనుకాడబోమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలో సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులతో మండల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారుల వరకు ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టి స్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే ప్రజలతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయం, విద్యు త్, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్య, హౌసింగ్, వైద్య శాఖల తీరుతెన్నులపై ప్రభాకర్‌రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా శాఖల పనితీరును శాఖల వారీగా సమీక్షించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
హేమరాజ్‌సింగ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే
వైద్యరత్న నేషనల్ అవార్డు అందుకోవడం పట్ల ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.హేమరాజ్‌సింగ్‌ను కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సన్మానించారు. భవిష్యత్త్‌లో ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కొంగ రి రవి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కై లాసం, తహసీల్దార్ మోతీసింగ్, ఇన్‌చార్జి ఎంపీడీవో సోమిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు తదితరులు ఉన్నారు.


