నంగునూరు(సిద్దిపేట): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుతప్పవని సీపీడీఓ శారద హెచ్చరించారు. ఆంక్షాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో ఫోర్జరీ సంతకాలతో సరుకులు పక్కదారి పడుతున్నాయని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బుధవారం సీడీపీఓ శారద విచారణ చేపట్టారు. గ్రామంలో బాలింతలు, చిన్నారులు, గర్భిణీల వివరాలు సేకరించి వారికి సరుకులు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. టీచర్ సమయ పాలన పాటించడంలేదని, సెలవు దినాల్లో సరుకులు అందిస్తున్నట్లు ఫోర్జరీ సంతకాలు చేస్తోందని గ్రామస్తులు ఆరోపించారు. అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారుల సంతకం తీసుకుని సరుకులు ఇవ్వాలని, వారికి బదులుగా వేరే వారికి ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


