మొక్కల సంరక్షణ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణ ముఖ్యం

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

● జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ● కలెక్టర్‌ హైమావతి

● జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ● కలెక్టర్‌ హైమావతి

కొండపాక(గజ్వేల్‌): మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించే బాధ్యత ముఖ్యమని కలెక్టర్‌ హైమావతి అన్నారు. మర్పడ్గ శివారులోని తేజోవనం అర్బన్‌ పార్కులో వన మహోత్సవంలో భాగంగా గురువారం సీపీ రష్మీపెరుమాళ్‌, అటవీ శాఖ అధికారి పద్మజరాణితో కలిసి కలెక్టర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మొక్కలను నాటేందుకు కార్యచరణ సిద్ధం చేశామన్నారు. మొక్కలు నాటడంతోనే సరిపెట్టకుండా సంరక్షించే బాధ్యత అటవీ శాఖతో పాటు ఇతర శాఖ అధికారులు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో, రోడ్ల వెంబడి, దేవాలయాల, పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటాలన్నారు. వనమహోత్సవ విజయవంతం కోసం ప్రజలు భాగస్వా మ్యం కావాలని కోరారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో సీఎం రేవంత్‌రెడ్డి మొక్కను నాటి చేసిన ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ ద్వారా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దరిపల్లి చంద్రం, అధికారులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు లక్ష్యం సాధించాలి

సిద్దిపేటరూరల్‌: ఆయిల్‌పామ్‌ సాగులో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. ఆయిల్‌ పామ్‌తో పాటు పండ్లు, పూలు, కూరగాయల మొక్కలను నాటడానికి కార్యాచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిని పెంచే దిశగా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు. దూల్మిట్ట, ఆకారం, బక్రీచెప్యాల, నంగునూరు, చిట్టాపూర్‌ గ్రామాల్లో ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన అధికారులను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

యూజీ నీట్‌ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్‌ కె. హైమావతి జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 21న జరగనున్న నీట్‌ పరీక్షకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 723 మంది, ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 216 మంది మొత్తంగా 939 మంది పరీక్షకు హాజరుకానున్నారన్నారు. పరీక్ష జరిగే ప్రతి గదిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, కలెక్టరేట్‌ ఏవో రాజ్‌ కుమార్‌, పరీక్ష కోఆర్డినేటర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement