‘కృత్రిమ మేధ’లో ప్రత్యేక శిక్షణ | - | Sakshi
Sakshi News home page

‘కృత్రిమ మేధ’లో ప్రత్యేక శిక్షణ

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

హుస్నాబాద్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపిక చేసిన విద్యార్థులకు కృత్రిమ మేధ, డిజిటల్‌ లెర్నింగ్‌పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ భిక్షపతి మాట్లాడుతూ హైదరాబాద్‌ ఉన్నత విద్య కమిషనర్‌ సౌజన్యంతో, జెఎన్‌టీయూ సాంకేతిక విశ్వ విద్యాలయం సహకారంతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెంటార్‌ షిప్‌ కార్యక్రమం ద్వారా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తమ కళాశాల విద్యార్ధులు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం తొడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్‌ జయశ్రీ, అద్యాపకులు రాజ్యలక్ష్మి, చంద్రమౌళి, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement