చదువుతున్నా.. రాస్తున్నా.. | - | Sakshi
Sakshi News home page

చదువుతున్నా.. రాస్తున్నా..

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

నేను 5వ తరగతి చదువుతుండగానే పెళ్లి చేశారు. ఇప్పుడు నా వయసు 55 ఏళ్లు. బస్సు పేర్లు చదవడం మాత్రమే వచ్చేది. అమ్మ అక్షరమాల కార్యక్రమంలో మళ్లీ చదువు చెప్పడంతో చదువుతున్నా.. రాస్తున్నా. నాటి చదువుకునే రోజులు గుర్తుకు వచ్చాయి.

–అరుణ, చెప్యాల

14 మందికి శిక్షణ ఇచ్చాం

మహిళలకు వర్ణమాల, చదవడం రాయడం, అక్షరాలు మిస్సింగ్‌ లాంటివి నేర్పించాం. 14 మందికి పరీక్ష నిర్వహిస్తే అందరూ ఉత్తీర్ణత సాధించారు. కొంత ఇబ్బంది అయినా అందరూ నేర్చుకునేందుకు మక్కువ చూపారు.

– నవనీత, వలంటర్‌, మిరుదొడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement