దోస్త్‌ ప్రక్రియ పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

దోస్త్‌ ప్రక్రియ పొడిగింపు

Jun 19 2026 7:45 AM | Updated on Jun 19 2026 7:45 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): దోస్త్‌ మూడో విడుత అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 21 వరకు పొడిగించినట్లు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్‌) ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ సునీత తెలిపారు. గురువారం కళాశాలలో ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ మొదటి, రెండో విడతలో సీట్లు రాని విద్యార్థులు దోస్త్‌ వెబ్‌సైట్‌లో ఈ నెల 21 వరకు దరఖాస్తు, 22 వరకు వెబ్‌ ఆప్షన్‌ ఇవ్వవచ్చాన్నారు. జూన్‌ 25న సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. జూన్‌ 26 నుంచి జూలై 2 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, జూలై 4 వరకు కళాశాలలో ద్రువపత్రాలను సమర్పించి సీటును దృవీకరించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement