కదిలిన బల్దియా.. | - | Sakshi
Sakshi News home page

కదిలిన బల్దియా..

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

సిద్దిపేటజోన్‌: బల్దియా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. భవనాల ఆస్తి పన్ను విధింపు ప్రక్రియలో సిబ్బంది తీరు, భారీ భవనాలకు నామమాత్రంగా పన్ను విధింపుపై ఈనెల 16న సాక్షిలో ప్రచురితమైన ‘కాసులిచ్చుకో.. డిస్కౌంట్‌ పుచ్చుకో’ అనే కథనానికి బల్దియా అధికారులు స్పందించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ ఆదేశాల మేరకు పట్టణ శివార్లలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, మోషన్‌ స్కూల్‌ ఉన్న భవనాల కొలతలు సరిచూశారు. ప్రస్తుతం రూ.4లక్షలు ఉన్న మోషన్‌ స్కూల్‌ బిల్డింగ్‌ను రూ.6లక్షల ఆస్తిపన్నుగా సవరించారు. అదేవిధంగా రూ.3.15లక్షలు ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ భవనానికి రూ.4.15లక్షలు గా రివిజన్‌ చేశారు. ఇంకా పట్టణంలో మరిన్నింటికీ కొలతలు తీయాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement