● నకిలీ పత్రాలు, సర్వే నంబర్లు సృష్టించిన ముఠా ● రెవెన్యూ అధికారుల అండదండలు ● లబోదిబోమంటున్న బాధితులు
దర్జాగా ప్రభుత్వ భూమి విక్రయం
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోతోంది. రెవెన్యూ అధికారుల అండదండలతో ఏకంగా నకిలీ సర్వే నంబర్లు సృష్టించి ప్రభుత్వ భూమిని విక్రయించడం గమనార్హం. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వారు.. అసలు విషయం తెలియడంతో లబోదిబోమంటున్నారు. ఇటీవల కలెక్టరేట్‌లో, పోలీస్ స్టేషన్‌లలో బాధితులు ఫిర్యాదులు చేశారు.
కొండపాక మండలం దుద్దెడ శివారులో కలెక్ట రేట్ ఏర్పాటు కావడంతో పరిసర ప్రాంతాల్లో భూ ములకు డిమాండ్ పెరిగింది. దీంతో అసైన్డ్, కలెక్ట రేట్ నిర్మాణం కోసం సేకరించిన భూమిపై భూ మాఫియా కన్ను పడింది. ప్రభుత్వ, అసైన్డ్ భూము లు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ముఠాగా ఏర్పడి..
దుద్దెడతో పాటు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన నాయకులు ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా సర్వే నంబర్లు మార్చి, నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో కింది స్థాయి నుంచి పై అధికారి వరకు డబ్బులు ముట్టజెబుతూ ఇష్టారాజ్యంగా ఆక్రమ రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అధికారుల అండతోనే..
మండల తహసీల్దార్ కార్యాలయ అధికారుల అండతోనే ఈ ముఠా భూ దందా జరుపుతోందని సమాచారం. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రహరీని నిర్మించి 59 జీఓ కింద రెగ్యులరైజ్ కోసం దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల భూ బాధితులు కలెక్టరేట్‌లో ఏవో రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
అమ్మకాలు ఇలా..
ముఠా గుట్టురట్టు: నిందితుల అరెస్ట్


