న్యూస్‌రీల్
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
గజ్వేల్/మద్దూరు(హుస్నాబాద్):ప్రజాప్రతినిధులు కదిలారు.. వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌కు చెందిన సర్పంచ్ కృష్ణ తన కుమారుడు, కూమార్తెను గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం చేర్పించారు. అలాగే మద్దూరు మండలం వల్లంపట్ల ఉపసర్పంచ్ మాచర్ల రఘు తన కూతురు, కుమారుడిని స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకే తనవంతు బాధ్యతగా పిల్లలను ఇక్కడ చేర్పించినట్లు సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ రఘు తెలిపారు.


