పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు

మురళీ, రామచంద్రం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మురళీ, రామచంద్రం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో జరిగిన పద్మశాలీల సమావేశానికి ముఖ్యఅతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలన్నా రు. పాఠ్య పుస్తకాలలో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుగుదలకు కృషి చేస్తామన్నారు. కోకాపేటలోని రాష్ట పద్మశాలీ సంఘానికి కేటాయించిన స్థలంలో ప్రభు త్వ నిధులతో భవననిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. చేనేత సంఘాలకు వెంటనే ఎన్నికల నిర్వ హించి, చేతినిండా పని కల్పించాలన్నారు. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను రాష్ట్ర ప్రభు త్వం టెస్కో ద్వారా ఖరీదు చేయాలన్నారు. 50 ఏళ్లు నిండిన పద్మశాలీలకు పెన్షన్‌ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులకు రూ. లక్ష లోన్‌తో పాటు ఆధునిక మగ్గా లు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కస్తూరి సతీష్‌, పట్టణ పద్మ శాలి సంఘం అధ్యక్షుడు కాముని రాజేశం, జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement